సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (18:13 IST)

ఆ రోజు నా భార్య ఎందుకు ఏడ్చిందంటే? రోహిత్ శర్మ

Rohit Sharma
2017లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ మూడో డబుల్ సెంచరీని సాధించగా అదే రోజు అతని రెండో వివాహ వార్షికోత్సవం కూడా. రోహిత్ డబుల్ సెంచరీని సమీపిస్తున్న సమయంలో స్టాండ్స్‌లో అతని భార్య రితిక కాస్త కన్నీరు పెట్టుకుంది. 
 
దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ... ఎందుకు ఏడ్చావని ఆమెను అడిగితే.. 196వ పరుగు కోసం తాను డైవ్ చేయాల్సి వచ్చిందని.. దీంతో తన చెయ్యి మెలిక పడటంతో ఏడ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఆమె చాలా సున్నితమైన వ్యక్తి అంటూ తెలిపాడు.
 
కాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మైదానంలో ఆడుతున్నాడంటే అతని భార్య రితికా చేసే సందడిని కెమెరాలన్నీ చూస్తూవుంటాయి. రోహిత్ సిక్స్ కొట్టినా అవుట్ అయినా సరే కెమెరాలు ఆమె వైపు చూపిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.