సచిన్ బయోపిక్: సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ ట్రైలర్ రిలీజ్ (వీడియో)
అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రయాణం చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రం ట్రైలర్‌ని గురువారం విడుదలైంది. క్రికెటర్లు అజహర
అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రయాణం చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రం ట్రైలర్‌ని గురువారం విడుదలైంది. క్రికెటర్లు అజహరుద్దీన్, ధోనిల ఆటో బయోగ్రఫీలపై తెరకెక్కిన సినిమాలు హిట్ అవడంతో సచిన్ సినిమా హిట్ అవుతుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సచిన్ బయోపిక్ మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మాస్టరే ఇందులో టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా కోసం యాక్టర్‌గానూ సచిన్ అవతారం ఎత్తాడు.
తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో సచిన్‌కి సంబంధించిన అన్ని అంశాలు చూపించారు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు జేమ్స్ ఎర్‌స్కైన్ దర్శకత్వ పగ్గాలు చేపట్టారు. ఇంకా రవి భగ్‌చంద్కా, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం.