ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (10:44 IST)

నమన్‌ ఓజా బ్యాటింగ్ అదుర్స్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కితాబు

sachin tendulkar
రోడ్‌ సేఫ్టీ టీ20 ప్రపంచ సిరీస్‌ను రెండో సారి భారత లెజెండ్స్‌ జట్టు కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నట్టుగా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన నమన్‌ ఓజా ఆటతీరును ప్రత్యేకంగా అభినందించాడు.
 
ఇంకా ''మ్యాచ్‌ గెలిచేందుకు జట్టు ఎంతగానో కృషి చేసింది. చివరి మ్యాచ్‌లో ఓజా బ్యాటింగ్‌ మరో అద్భుతం. ఈ గెలుపును నా జట్టుకు, అభిమానులకు అంకితం ఇస్తున్నా'' అంటూ ట్వీట్‌ చేశాడు. మ్యాచ్‌ అనంతరం జట్టు విజయోత్సాహాలు జరుపుకొంటున్న ఫొటోలను షేర్ చేశాడు.