మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (15:20 IST)

నేను పాక్ క్రికెట్ టీమ్ డైటీషియన్ కాదు : సానియా మీర్జా

పాకిస్థాన్ క్రికెటర్లు ఏం తింటున్నారో పట్టించుకోవడానికి తాను ఆ దేశ క్రికెట్ జట్టు డైటీషియన్‌ను కాదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కౌంటర్ ఇచ్చారు. సానియా మీర్జా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె తన కుమారుడుతో పాటు.. ప్రపంచ క్రికెట్ కప్ జరుగుతున్న ఇంగ్లండ్‌కు వెళ్లింది. అక్కడు తన కుమారుడు, భర్తతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇది హుక్కా బార్‌ని అని పలువురు చెపుతున్నారు. 
 
దీంతో పాకిస్థాన్ బ్యూటీ వీణా మాలిక్ స్పందించారు. 'సానియా మీ అబ్బాయిని కూడా హుక్కా బార్ కు తీసుకెళ్లడం దారుణం. అది చాలా ప్రమాదకరం. పైగా మీరు వెళ్లిన బార్‌లో జంక్‌ఫుడ్ అమ్ముతుంటారు. ఇలాంటి ఆహారం మీలాంటి క్రీడాకారులకు అనారోగ్యకరం. ఓ తల్లిగా ఈ విషయాలు మీకు తెలిసుండాలి' అంటూ వీణామాలిక్ కామెంట్ చేసింది.
 
వీణా వ్యాఖ్యలకు సానియా మీర్జా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తన కుమారుడిని తాను ఎక్కడకూ తీసుకెళ్లలేదని... అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరమని చెప్పింది. తన కుమారుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో తనకు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించింది. పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారో పట్టించుకోవడానికి తాను పాక్ క్రికెట్ టీమ్ డైటీషియన్ కాదని ఎద్దేవా చేసింది. వారి తల్లిని కాదని, టీచర్‌ను అంతకన్నా కాదని చెప్పింది.