బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (14:13 IST)

సచిన్‌కు కరోనా.. నా ఫేవరేట్ ప్రత్యర్థి త్వరలో కోలుకావాలి.. అక్తర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో సచిన్ ఉన్నారు. అయితే సచిన్ త్వరగా కోలువాలంటూ పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు. మైదానంలో తన ఫేవరేట్ ప్రత్యర్థి సచిన్ అని, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు అక్తర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తనకు కరోనా సంక్రమించినట్లు మార్చి 27వ తేదీన ట్విట్టర్ ద్వారా సచిన్ ఆ విషయాన్ని వెల్లడించారు.
 
సచిన్ తనకు ప్రత్యర్థి అంటూ అక్తర్ ట్వీట్ చేయడం పట్ల కొందరు నెటిజన్స్ పాక్ బౌలర్‌ను ట్రోల్ చేశారు. నువ్వు కేవలం ఫాస్ట్ బౌలర్ మాత్రమే అని, ఎంతో మంది మేటి బౌలర్లను సచిన్ ఎదుర్కొన్నట్లు ఓ నెటిజన్ అక్తర్‌ను ట్రోల్ చేశారు. పాక్ బౌలర్లు అయిన వకార్ యూనిస్, వసీం అక్రమ్‌లను కూడా సచిన్ ధీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపాడు. 
 
సచిన్ నీకు ప్రత్యర్థి ఏంటి.. వకార్‌, అక్రమ్‌లు ప్రత్యర్థులంటూ మరొకరు అక్తర్‌ను ట్రోల్ చేశారు. ఇటీవల వరల్డ్ సేఫ్ట్ రోడ్ సిరీస్‌లో ఆడిన సచిన్ కు కరోనా వైరస్ సోకింది. ఆ టోర్నీలో ఆడిన బద్రీనాథ్‌, యూసుఫ్ పఠాన్‌, ఇర్ఫాన్ పఠాన్‌లకు కూడా కరోనా సంక్రమించింది.