బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (21:56 IST)

శుభ్‌మాన్ గిల్‌ కొత్త ప్రేమాయణం.. ఎవరితో అంటే?

Gill
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. దీనికి సంబంధించిన పోస్ట్‌లు అప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. 
 
కానీ ఇప్పుడు గిల్ మరో నటితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవనీత్ కౌర్ ఇటీవల గిల్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపింది. దీంతో శుభ్‌మన్ గిల్, అవనీత్ కౌర్ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
అంతకుముందు 2023 సంవత్సరంలో వీరిద్దరూ కలిసి లండన్‌లో తిరుగుతూ కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు మరో సోషల్ మీడియా పోస్టులో శుభమాన్ గిల్, బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.