Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరంతా తిరిగి నన్ను నమ్మేల నేను కృషి చేస్తా : స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చేశాడు. బాల్ ట్యాంపరింగ్ కేసులో పట్టుపడి ఏకంగా జట్టుకు దూరం కావడమే కాకుండా, ఒక యేడాది పాటు నిషేధానికి లోనయ్యాడు. దీంతో ఆయ

Written By pnr
Updated: శుక్రవారం, 4 మే 2018 (16:58 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చేశాడు. బాల్ ట్యాంపరింగ్ కేసులో పట్టుపడి ఏకంగా జట్టుకు దూరం కావడమే కాకుండా, ఒక యేడాది పాటు నిషేధానికి లోనయ్యాడు. దీంతో ఆయన విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లాడు. ఈ హాలిడే టూర్ ముగించుకుని తిరిగి స్వదేశానికి వచ్చాడు.
 
ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన స్పందన తెలియజేశాడు. 'తిరిగి స్వదేశం ఆస్ట్రేలియాకి రావడం చాలా సంతోషంగా ఉంది. బయట కొంత సమయం విశ్రాంతి నాకు దొరికింది. ఆ సమయంలో నా కోసం ఎన్నో ఈ-మొయిల్స్, లెటర్స్ వచ్చాయి. మీరు నాపై చూపించిన ప్రేమకు వినయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీకు నాపై తిరిగి నమ్మకం వచ్చేలా చేసేందుకు నేను కృషి చేస్తాను' అని వ్యాఖ్యానించాడు. 
 
కాగా, ఈ కేసులో స్మిత్‌తో పాటు మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బ్యాట్స్‌మెన్ కెమారూన్ బాన్‌క్రాఫ్ట్‌ కూడా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని నిషేధం ఎదురుకుంటున్న విషయం తెల్సిందే. స్మిత్‌, వార్నర్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా యేడాది పాటు నిషేధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. ఈ ఘటనతో స్మిత్, వార్నర్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్పోయే అవకాశాన్ని కూడా కోల్పోయారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments