శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (16:25 IST)

నిషేధంపై అప్పీలుకు వెళ్లే ప్రసక్తే లేదు .. శిక్ష అనుభవిస్తా : స్టీవ్ స్మిత్

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పట్టుబడి ఒక యేడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విధించిన ఒక యేడాది నిషేధంపై అప్పీలుకు వెళ్లబోనని స

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పట్టుబడి ఒక యేడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విధించిన ఒక యేడాది నిషేధంపై అప్పీలుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. ముఖ్యంగా, తాను చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తానని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఓ జట్టుకు కెప్టెన్‌గా జరిగిన దానికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పిన స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని చాలెంజ్ చేయబోనని స్పష్టంచేశాడు. 
 
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో బాల్ ట్యాపరింగ్‌కు పాల్పడిన స్మిత్, డేవిడ్ వార్నర్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. స్మిత్, వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం విధించగా, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల వేటు పడింది. ఈ కాలంలో వారు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అనర్హులు.