మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (11:54 IST)

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రాబబుల్స్ జట్టు ప్రకటన

ఇంగ్లాండ్ జట్టుతో సొంతగడ్డపై భారత్ సిరీస్‌లు కొనసాగుతున్నాయి. ఇదివరకే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం టీ20 సిరీస్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక టీ20 జరగనుంది.
 
ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించనుండగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పాండ్యా బ్రదర్స్‌కు అవకాశం ఇచ్చింది. తొలిసారిగా బౌలర్ ప్రసిద్ కృష్ణను ఎంపిక చేయడం గమనార్హం.
 
ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రాబబుల్స్‌..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్.