భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన : ఆర్చర్‌కు చోటు.. తొలి రెండు టెస్టులకు జట్టు ఎంపిక
భారత్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటించనుంది. శ్రీలంక పర్యటనను ముగించుకుని ఇంగ్లండ్ నేరుగా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది.
ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. తన ఎక్స్‌ప్రెస్ వేగంతో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించే జోఫ్రా ఆర్చర్ జట్టులోకి పునరాగమనం చేశాడు.
అలాగే, ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్, ఓపెనర్ రోరీ బర్న్ కూడా జట్టులోకి వచ్చారు. బెయిర్ స్టో, శామ్ కరన్, మార్క్‌వుడ్‌లకు టీమిండియాతో తొలి రెండు టెస్టులకు విశ్రాంతినిచ్చారు. ఫిట్నెస్ నిరూపించుకుంటే ఓల్లీ పోప్ ఇంగ్లాండ్ జట్టుతో కలుస్తాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.
తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఇదే...
జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ఓల్లీ స్టోన్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, స్టూవర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, డామ్ బెస్, క్రిస్ వోక్స్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్.
రిజర్వ్ ఆటగాళ్లు...
జేమ్స్ బ్రేసీ, మాసన్ క్రేన్, సకిబ్ మహమూద్, మాట్ పార్కిన్సన్, ఓల్లీ రాబిన్సన్, అమర్ వర్దీ.