సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:47 IST)

భారత్‌తో టీ20 సిరీస్ : జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

Australia
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో వార్నర్‌కు చోటు కల్పించలేదు. త్వరలోనే టీ20 ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో జట్టులోని ప్రధాన ఆటగాడుగా ఉన్న వార్నర్‌కు విశ్రాంతినిచ్చింది. 
 
ఈ టీ20 సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ 23న నాగ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ 25న హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డేల్లో వార్నర్ వరుసగా 57, 13 చొప్పున పరుగులు చేశారు.
 
కాగా, భారత్ టీ20 సిరీస్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో... జట్టు సభ్యులు వీరే... 
ఆస్టన్ అగర్, పాట్ కమిన్సన్, టిమ్ డేవిడ్, అరోన్ ఫించ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిష్, మిచెల్ మార్ష్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డసన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినెస్, మ్యాథ్యువేడ్, కేమరన్ గ్రీన్, ఆడం జంపా.