బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (12:28 IST)

ఆస్పత్రిలో స్టెప్పులేని వినోద్ కాంబ్లీ (వీడియో వైరల్)

vinod kambli
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన కాంబ్లీని ముంబైలోని రాణే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మూత్ర ఇన్ఫెక్షన్, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన కాంబ్లీకి వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించగా అతని మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. 
 
దీంతో కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. ప్రస్తుతం కాంబ్లీ కోలుకుంటున్నాడు. తాజాగా అతను ఆసుపత్రి సిబ్బందితో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేశాడు. ‘చక్‌ దే ఇండియా’ పాటకు హుషారుగా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు, కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వైద్యులు సోమవారం తెలిపారు.