శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (14:18 IST)

విరాట్ కోహ్లీ ఖాతాలో డీమెరిట్ పాయింట్.. ఇది మూడోసారి..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో డీమెరిట్ పాయింట్ చేరింది. ఇందుకు కారణం సఫారీ బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌ను కోహ్లీ కావాలనే తన భుజంతో ఢీకొట్టడమే కారణం. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో సఫారీ బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌ను కోహ్లీ భుజంతో ఢీకొట్టాడు. 
 
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని లెవల్ 1 ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీని ఐసీసీ దోషిగా తేల్చింది. కోహ్లీ సైతం తన నేరాన్ని అంగీకరించడంతో అతడి ఖాతాలో ఐసీసీ డీమెరిట్ పాయింట్ జత చేర్చింది. 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత కోహ్లీకి డీమెరిట్ పాయింట్ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
జనవరి 15, 2018లో దక్షిణాఫ్రికాతో ప్రిటోరియా వేదికగా జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ ఖాతాలో తొలిసారి డీ మెరిట్ పాయింట్ చేరింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి కోహ్లీ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్‌ని ఐసీసీ జత చేర్చింది.