ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

ఆప్ఘాన్ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ సక్సెస్ సందేశాలు...

విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఇప్పుడున్న క్రికెటర్లలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఆటలోనూ.. ఆటను నడిపించడంలోనూ తనదైనశైలిలో ముందుకు దూసుకెళుతూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఇప్పుడున్న క్రికెటర్లలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఆటలోనూ.. ఆటను నడిపించడంలోనూ తనదైనశైలిలో ముందుకు దూసుకెళుతూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఆ సక్సెస్ ఫార్ములాలను ఆఫ్గానిస్థాన్‌ క్రికెటర్లతో పంచుకున్నాడు. టీ20 టోర్నీని విజయవంతంగా పూర్తి చేసినందుకు కోహ్లీకి అఫ్గాన్ క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. 
 
భవిష్యత్‌లో జరిగే మ్యాచ్‌ల్లోనూ ఉత్సాహంగా ఆడాలని కోహ్లీ ఆకాంక్షించారు. టోర్నీకి సంబంధించిన వీడియోను అధికారికంగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసినట్లు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. జరగబోయే ప్రయాణానికి 'ఆల్‌ ద బెస్ట్‌' అని కోహ్లీ చెప్పారు. ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేస్తే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతామని కోహ్లీ వెల్లడించారు.