శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (17:01 IST)

భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ రికార్డ్

Shreyanka Pati
Shreyanka Pati
భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో ఎవరూ కూడా సీపీఎల్‌లో భాగం కాలేదు. 
 
సీపీఎల్ ఆడనున్న తొలి టీమిండియా ప్లేయర్ శ్రేయాంకనే. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని శ్రేయాంక.. సీపీఎల్ ఆడే ఛాన్స్ కొట్టేసింది. 
 
ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అత్యధిక వికెట్స్ పడగొట్టిన బౌలర్‌గా నిలిచింది. 
 
సీపీఎల్ తరపున అమెజాన్ వారియర్స్ ఫ్రాంచైజీతో శ్రేయాంక డీల్ కుదుర్చుకుంది. రాబోయే ఎడిషన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరుగనుంది.