శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (10:06 IST)

యూపీ: గుర్రాలకు ఇచ్చే ఇంజక్షన్‌.. యువతిపై 4 రోజులు అత్యాచారం

rape
యూపీలో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. శునకాలు, గుర్రాలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిద్వాయ్‌నగర్‌కు చెందిన అర్జున్‌సింగ్ ఓ షోరూములో పనిచేసే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో కలుద్దామన్నాడు. 
 
ఆపై శునకాలు, గుర్రాలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజులపాటు ఆమెను బందీగా ఉంచుకుని పలుమార్లు అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ మొత్తం ఘటనను నిందితుడు వీడియో తీశాడు. 
 
ఈ విషయాన్ని బయటికి చెప్తే.. వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. అయితే మళ్లీ మళ్లీ అతడు బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయినా సరే ఏమాత్రం తగ్గని నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి తన మాట వినకుంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి.