శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2025 (12:31 IST)

Yuzvendra Chahal : ధనశ్రీతో చాహల్ విడాకులు.. అంతా ప్రియురాలి కోసమా... సోక్రటీస్ సూక్తులెందుకు?

Chahal - Dhana Sree
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల వార్తల మధ్య రహస్య సందేశాన్ని పంచుకున్నాడు. స్పిన్నర్ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ నుండి కోట్‌ను పంచుకున్నాడు. "అన్ని శబ్దాల కంటే నిశ్శబ్దం వినగలిగే వారికి ఒక గాఢమైన రాగం." అంటూ  పేర్కొన్నాడు.

లెగ్ స్పిన్నర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో క్రిప్టిక్ కోట్‌ను షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీని అన్‌ఫాలో చేసిన తర్వాత అతని మునుపటి పోస్ట్. చాహల్- ధనశ్రీ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. చాహల్, ధనశ్రీ విడిపోవడంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ ధనశ్రీ ఉన్న ఫోటోలను తన ప్రొఫైల్ నుండి తొలగించారు.

యుజ్వేంద్ర చాహల్ 2023 నుండి భారతదేశానికి ఆడలేదు. అతను ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2024లో టీమ్ ఇండియా జట్టులో భాగమైనప్పటికీ, మేనేజ్‌మెంట్ అతనికి స్థానం కల్పించలేదు. ఇకపోతే.. చాహల్ డిసెంబర్ 2024లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు ఆయన ఆడిన 72 వన్డేలలో, అతను 27.13 సగటుతో, 5.26 ఎకానమీ రేటుతో 121 వికెట్లు తీశాడు.

ఇకపోతే.. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సంబంధించి రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తన సతీమణి ధనశ్రీ వర్మ‌తో చాహల్ విడాకుల అంశం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా చాహల్ ఓ అమ్మాయితో కెమెరాలకు చిక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ముంబైలోని జేడబ్ల్యూ మారియల్ హోటల్‌లో ఓ అమ్మాయితో చాహల్ కనిపించాడు. ఆమెతో కలిసి హోటల్ బయటకు వచ్చే సమయంలో మీడియాను చూసి చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని కనిపించాడు.

సదరు యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు ప్రచారం జరుగుతోంది. ధనశ్రీతో పరిచయం కాకముందే వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఈ వార్తలను చాహల్ ఖండించాడు. కానీ పెళ్లికి తర్వాత కూడా ఈ అఫైర్ కొనసాగుతోందని.. అందుకే ధనశ్రీ అతనికి దూరమైందని వార్తలు వస్తున్నాయి.