శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:39 IST)

ఏడవకు చిట్టితల్లీ జోహ్రా... మీకు నేనున్నా... గౌతం గంభీర్

జమ్ము-కాశ్మీరులోని అనంతనాగ్ ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రా చదువు బాధ్యతను తను భరిస్తానని ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్ వెల్లడించారు. ఆమె ఒక్కతే కాదు... జమ్ము-కాశ్మీర్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవానుల పిల్లల చదు

జమ్ము-కాశ్మీరులోని అనంతనాగ్ ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రా చదువు బాధ్యతను తను భరిస్తానని ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్ వెల్లడించారు. ఆమె ఒక్కతే కాదు... జమ్ము-కాశ్మీర్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవానుల పిల్లల చదువును తనే భరించాలని నిర్ణయించుకున్నట్లు గౌతం గంభీర్ పేర్కొన్నారు. గౌతం గంభీర్ ఫౌండేషన్ ద్వారా ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకోనున్నట్లు తెలిపాడు.
 
ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా ముష్కరుల చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేసే గంభీర్ జమ్ము-కాశ్మీరులో వేర్పాటువాదుల చేష్టలపై కూడా ట్వీట్స్ చేస్తుంటాడు. అమర జవానులు ప్రాణాలు అర్పించి దేశానికి రక్షణ కవచంగా వుంటున్నారని గంభీర్ కొనియాడారు. జోహ్రా చదువు బాధ్యతను తనే భరిస్తానని ట్విట్టర్లో ఇలా ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చాడు. 
 
" జోహ్రా... నీ కలలు సాకారం చేసుకునేందుకు నా వంతు సహకారం అందిస్తాను. నీ జీవిత కాలం నీ చదువు బాధ్యత నాదే  #daughterofIndia. జోహ్రా, నీ కన్నీటి ధారలకు ఈ భూమాత హృదయం ద్రవీభవిస్తోంది. దయచేసి ఏడవకు తల్లీ... అమరవీరుడైన నీ తండ్రికి ఇదే వందనం" అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు గంభీర్.