1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (17:23 IST)

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల ఎంగేజ్‌మెంట్ త్వరలోనే!

విరాట్ కోహ్లీ అభిమానులకో గుడ్ న్యూస్. టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని తెలిసింది. 
 
మొన్నటిదాకా ఏకంగా ఇంగ్లండ్ పర్యటనకు గర్ల్ ఫ్రెండ్‌ను వెంటబెట్టుకెళ్లిన కోహ్లీ త్వరలో వివాహం చేసుకోనున్నాడు. అనుష్కతో ఎఫైర్‌పై నోరు విప్పని కోహ్లీ... ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోనున్నాడు. 
 
తాజాగా, వీరిద్దరి కుటుంబాలు ఓ వారం క్రితం కలిశాయట. ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్కలకు ముడివేస్తేనే మంచిదని ఇరు కుటుంబాలు ఓ అభిప్రాయానికి వచ్చాయని ముంబై మీడియా పలు కథనాలను ప్రచారం చేస్తోంది. ఈ కథనాలే నిజమైతే, టీమిండియా వైస్ కెప్టెన్ కోహ్లీ త్వరలో ఓ ఇంటివాడు కావడం ఖాయం.