ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 4 మార్చి 2017 (06:55 IST)

లెక్క సరిచేస్తారా.. లెక్కలోకి లేకుండా పోతారా: నేడే రెండో టెస్టు ప్రారంభం

బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భాగంగా నేటి (శనివారం) నుంచి ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భాగంగా నేటి (శనివారం) నుంచి ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లో వెనుకబడిన భారత్‌ ఇక్కడ విజయం సాధించి సమంగా నిలవాలని పట్టుదలగా ఉండగా... ఈ మ్యాచ్‌ గెలిస్తే ట్రోఫీని నిలబెట్టుకునే అవకాశం ఉన్న ఆసీస్‌ మరో గెలుపు అందుకోవాలని భావిస్తోంది. పుణే పిచ్‌పై వివాదం చెలరేగడంతో ఈ వికెట్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. అయితే ఇక్కడ వికెట్‌ గురించి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తెలుస్తోంది.
అంతా అనుకున్నట్లు సాగితే ఈ సమయానికి భారత జట్టు 1–0 ఆధిక్యంతో అమితోత్సాహంతో రెండో  టెస్టు బరిలోకి దిగేది. కానీ ‘రెండున్నర రోజుల’ పతనం తర్వాత ఆ షాక్‌ నుంచి కోలుకొని నిలబడాల్సిన స్థితి ఇప్పుడు మన జట్టుది. ఒక మ్యాచ్‌లో జట్టు ఓడటం అసాధారణం ఏమీ కాకపోయినా, ఘోర వైఫల్యం సహజంగానే మానసికంగా కూడా జట్టును దెబ్బ తీసింది. అయితే ఇప్పుడు తమలో అసలు సత్తాను బయట పెట్టి పుణే పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. బెంగళూరులోనైనా మన ఆట మారుతుందా అనేది  ఆసక్తికరం.
 
సిరీస్‌కు ముందు అన్ని వైపుల నుంచి అండర్‌డాగ్‌ ముద్ర పడటంతో ఒక రకమైన ఆందోళనతో కనిపించిన ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్‌ విజయం ఆకాశంలో నిలిపింది. ‘భారత బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టము’ అంటూ మర్యాద చూపిన కంగారూలు ఇప్పుడు తమ సహజశైలిలో మాటల దాడి చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని పుణే విజయం ఇచ్చింది. పైగా భారత గడ్డపై వారికి మెరుగైన రికార్డు ఉన్న వేదికపై జరగబోతున్న మ్యాచ్‌ ఆసీస్‌ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. మరి ఆ జట్టు అదే జోరు కొనసాగిస్తుందా లేక ప్రత్యర్థి ముందు సాగిలపడుతుందా!  
 
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌  కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, విజయ్, పుజారా, రహానే, సాహా, జయంత్‌నాయర్, అశ్విన్, జడేజా, ఉమేశ్, ఇషాంత్‌భువనేశ్వర్‌.
ఆస్ట్రేలియా స్మిత్‌ (కెప్టెన్‌), రెన్‌షా, వార్నర్, షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, మిషెల్‌ మార్‌‡్ష, వేడ్, స్టార్క్, ఒకీఫ్, లయోన్, హాజల్‌వుడ్‌.