శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (07:42 IST)

ఆసీస్ ఆటగాళ్ల నీతి ఇదేనా... కోహ్లీని వెక్కిరించడంపై వీవీఎస్ ధ్వజం

వివాదాలు ముందు పుట్టి ఆస్ట్లేలియా క్రికెట్ టీమ్ తర్వాత పుట్టినట్లుగా ఉంది. భారత్ టూర్‌లో స్లెడ్జింగ్‌కు దిగబోమంటూనే వాళ్లాడుతున్న వికృత చేష్టలకు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా రాంచీ టెస్టు

వివాదాలు ముందు పుట్టి ఆస్ట్లేలియా క్రికెట్ టీమ్ తర్వాత పుట్టినట్లుగా ఉంది. భారత్ టూర్‌లో స్లెడ్జింగ్‌కు దిగబోమంటూనే వాళ్లాడుతున్న వికృత చేష్టలకు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా రాంచీ టెస్టులో విరాట్ కోహ్లీ గాయాన్ని కూడా వదలకుండా ఆసీస్ కేప్టెన్ స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ గేలి చేయడాన్ని క్రికెట్ దిగ్గజాలు తీవ్రంగా తప్పుపట్టారు.
 
టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆసిస్‌‌పై అంతెత్తున లేచాడు. విరాట్ కోహ్లీని వెక్కిరించే విధంగా ఆసిస్ ఆటగాళ్లు చేసిన చర్యలను తీవ్రంగా తప్పుపట్టాడు. ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, గ్లేన్ మాక్స్‌వెల్ ఏ విధమైన సంకేతాలు పంపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్లెడ్జింగ్ వరకు ఓకె కానీ, ప్రత్యర్ధి ఆటగాడు గాయపడి బాధపడుతున్న సందర్భాన్ని తీసుకుని వెక్కిరించడమేంటని ప్రశ్నించాడు. 
 
ఈ సందర్భంగా లక్ష్మణ్ బంతి తగిలి కన్నుమూసిన ఆసిస్ ఆటగాడు ఫిల్ హ్యూగ్స్‌ను గుర్తు చేశాడు. హ్యూగ్స్ సంఘటన తర్వాత ప్రతి ఆటగాడు మైదానంలో గాయమైన వారిపట్ల ప్రవర్తిస్తున్న తీరు మారిపోయిందని వివరించాడు. ఆటలో కఠినంగా వ్యవహరించవచ్చని, కానీ క్రీడాస్ఫూర్తిని మరవకూడదని చెప్పాడు వివిఎస్ లక్ష్మణ్. 
 
తొలి రోజు ఆటలో ఆసిస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేశాడు. ఈ సమయంలో భుజానికి నేలదెబ్బ తగలడంతో 400 నిమిషాల పాటు మైదానాన్ని వీడాడు. మళ్లీ బ్యాటింగ్‌కు దిగినప్పుడు 6 పరుగులకే ఔటయ్యాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్లిప్‌లో ఉన్న ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాక్స్‌వెల్ భుజంపై చేయి వేసుకుని కోహ్లీని ఇమిటేట్ చేశారు.