ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 19 జూన్ 2017 (02:24 IST)

ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడే టీమిండియా ఓడిపోయిందా? తలబాదుకుంటున్న నెటిజన్లు

టాస్ గెలిచి కూడా టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోకుండా పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు ఫైనల్ విజేత ఎవరో తేలిపోయిందా? పాకిస్తాన్ క్రికెట్ జట్టు కళ్లముందే ఐసీసీ ట్రోఫీని ఎగురేసుకుపోయాక బాధ భరించలేకపోతున్న నెటిజన్లు ఇదే ఫీలింగ్ వ్యక్తం చేస

టాస్ గెలిచి కూడా టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోకుండా పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు ఫైనల్ విజేత ఎవరో తేలిపోయిందా? పాకిస్తాన్ క్రికెట్ జట్టు కళ్లముందే ఐసీసీ ట్రోఫీని ఎగురేసుకుపోయాక బాధ భరించలేకపోతున్న నెటిజన్లు ఇదే ఫీలింగ్ వ్యక్తం చేస్తున్నారు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ రికార్డు ఎంత పేలవంగా ఉందో తెలిసి కూడా ముందుగా దానికి బ్యాంటింగ్ అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడే టీమిండియాకు జరగకూడదనిది జరిగిపోయిందని నెటిజన్ల అనుమానం.
 
ఇటీవల జరిగిన ఏ కీలకమైన టోర్నీ ఫైనల్లోనూ టీమిండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న సందర్భాలు లేవని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు లక్ష్య ఛేదనకు అవకాశం ఇస్తే వారికున్న బ్యాటింగ్ బలంతో సులభంగా ఆటను ఎగరేసుకుపోతారన్నే భయంతో నాటి భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసీస్‌కు మొదట బ్యాటింగ్‌కు అవకాశం ఇచ్చి తప్పటడుగు వేశాడని చెబుతున్నారు. 
 
కానీ ఈరోజు కేవలం అహంకారం, నిర్లక్ష్యం కారణంగానే కోహ్లీ వెనకూ ముందూ చూసుకోకుండా టాస్ గెలిచి కూడా పాక్ టీమ్‌కు బ్యాటింగ్ అప్పగించాడని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ ఇంతవరకు 250 పరుగులకు మించిన లక్ష్య ఛేదనను మేజర్ టోర్నీలో సాధించలేకపోయిందని చెబుతున్నారు. కీలకమైన ఫైనల్స్‌లో స్కోర్ బోర్డ్ ఒత్తిడి అనేది ఏ జట్టుమీదైనా పనిచేస్తుందని. ప్రత్యర్థి అంచనాకు మంచి పరుగులు చేస్తే దాని ప్రభావం ఛేదన జట్టుపై తప్పక ఉంటుందని వీరంటున్నారు. 
 
ఏదేమైనా పాక్ జట్టు ఈ విజయంతో ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్యాట్స్‌మెన్ రాజ్యమేలుతున్న నేటి క్రికెట్‌లోనూ మంచి బౌలింగే అంతిమంగా మ్యాచ్‌లను గెలిపిస్తుందని పాక్ నిరూపించిందని నెటిజన్ల అభిప్రాయం.