శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (10:03 IST)

తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిచిన యువతి.. ఆ సీన్ చెల్లెళ్లు చూశారనీ...

murder
తల్లిదండ్రులు లేకపోవడంతో తన ప్రియుడిని ఇంటికి పిలిపించిన ఓ యువతి.. అతనితో పడక గదిలో అసభ్యకర భంగిమలో ఉండాటాన్ని సొంత చెల్లెళ్లు చూశారు. ఈ విషయం ఎక్కడ తల్లిదండ్రులకు చెబుతారన్న భయంతో తన ప్రియుడితో కలిసి ఆ యువతి తోడబుట్టిన చెల్లెళ్లను హత్య చేసి, ఎవరో చంపేశారని నమ్మించే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు చిక్కింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన అంజలి (20) అనే యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఇటీవల తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో తన ప్రియుడిని నేరుగా ఇంటికి పిలిపించుకుంది. అతడితో సన్నిహితంగా ఉండగా ఆమె ఆరు, నాలుగు సంవత్సరాల వయస్సున్న చెల్లెళ్లు చూశారు. దీంతో ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు చెప్పేస్తారేమోనన్న భయంతో వారిద్దరినీ పదునైన ఆయుధంతో హత్య చేసింది. 
 
ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లెళ్లను ఎవరో చెంపేశారని చెప్పి వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. ఈ విచారణలో అంజలి దుస్తులపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించి, ఆమెను ప్రశ్నించగా అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ హత్యలో ఆమెకు సహకరించిన ప్రియుడితో పాటు మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంజలిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.