గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (08:17 IST)

రాజమండ్రి జైలులో తీవ్ర ఉక్కపోత.. డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబు

chandrababu naidu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనారోగ్యానికి గురయ్యారు. జైలులో తీవ్రమైన ఉక్కపోత కారణంగా ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ములాఖత్ నిర్వహించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో వారు జైలు వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని తనను కలిసిన కుటుంబ సభ్యులకు కూడా చంద్రబాబు తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజమండ్రి పరిసరాల్లోనూ గత నాలుగు రోజులుగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. రాజమండ్రి జైలు పరిసర ప్రాంతాల్లో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు ఉక్కపోతకు గురయ్యారు.