బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 జనవరి 2022 (10:08 IST)

లోన్ ఇవ్వలేదని బ్యాంకుకే నిప్పంటించి తగలబెట్టాడు, ఎక్కడ?

అసలే కరోనా కాలం. చేతిలో డబ్బులు ఆడటంలేదు. చాలామంది డబ్బులు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఇలా రుణం కోసం ఓ వ్యక్తి కర్నాటక లోని బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. ఐతే అతడి దరఖాస్తును తిరస్కరించింది సదరు బ్యాంకు.

 
దీనితో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి హవేరి జిల్లాలో బ్యాంకుకు నిప్పుపెట్టాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కాగినెల్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 436, 477, 435 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 
నిందితుడు రుణం కావాలని బ్యాంకును ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత అతని రుణ దరఖాస్తును బ్యాంక్ తిరస్కరించింది.