శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

సూసైడ్ నోట్ రాయించుకునిమరీ కుమార్తెను ఉరితీసిన కసాయి తండ్రి

hang
మహారాష్ట్రలో ఓ కసాయి తండ్రి కన్న కుమార్తెను ఉరేసి చంపేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడేముందు కుమార్తెతో సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత ఆమె మెడకు ఉరి వేసి చంపేశాడు. ఈ దారుణం నాగ్‌పూర్‌ జరిగింది. అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని కుమార్తెను చంపేశాడు. చివరకు సెల్‌ఫోనులోని ఫోటో ఆధారంగా పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. 
 
నాగ్‌పూర్‌కు చెందిన కూలీ పనులు చేసే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిలో పెద్ద కుమార్తె (16) ఈ నెల 16వ తేదీన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చేసుకుని విచారణ చేపట్టారు. 
 
కుటుంబ సభ్యులు అందరివద్దా విచారణ జరిపారు. అయితే, మృతురాలి తండ్రిపై అనుమానం వచ్చి ఆయన మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా, అందులో బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు మెడకు తాడు బిగించుకుని స్టూల్‌పై నిలబడిన ఫోటో కనిపించింది. ఆ తర్వాత ఆ కసాయి తండ్రి వద్ద తమదైనశైలిలో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.