గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2022 (17:10 IST)

ఫెసర్ల వేధింపులు.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

suicide
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వేలూరు జిల్లాలోని గుడియాత్తంకు చెందిన ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరేశన్ అనే వ్యక్తి కుమార్తె కార్తీక దేవి (21) ఏపీలోని చిత్తూరు జిల్లా అరకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చివరి సంవత్సరం చదవుతోంది.
 
ఈమెను విభాగాధిపతితో పాటు ఇతర అధ్యాపక సిబ్బంది కూడా వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేని కార్తీకదేవి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.