శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 డిశెంబరు 2021 (22:11 IST)

అమ్మాయిలతో కళాశాల ప్రిన్సిపాల్ అసభ్య నృత్యం

ఇస్లామాబాద్: కాలేజ్ ఫంక్షన్లలో 'అభ్యంతరకరమైన హావభావాలు- అసభ్య నృత్యం' చేసిన సంఘటనల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కళాశాల ప్రిన్సిపాల్‌తో సహా పాకిస్థాన్‌లో కనీసం 40 మందిపై కేసు నమోదు చేయబడింది. 
 
పాకిస్థాన్‌లోని హసిల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్, కొందరు సిబ్బంది, విద్యార్థులతో సహా 40 మందిపై అభ్యంతరకర సంజ్ఞలు, అసభ్యకర నృత్యాలు చేసినందుకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, కొంతమంది సిబ్బంది- అమ్మాయిలు "అశ్లీల కార్యకలాపాలలో" పాల్గొన్న వీడియో క్లిప్‌లు వైరల్ అయ్యాయి. దీనితో వారిపై కేసు నమోదు చేయాలని బహవల్‌పూర్ డిసి ఇర్ఫాన్ అలియా కతియా పోలీసులను ఆదేశించారు.
 
మరోవైపు హాసిల్‌పూర్ అసిస్టెంట్ కమిషనర్ కాలేజీకి సీల్ వేశారు. దీనిపై విచారణ చేసేందుకు డీసీ ఏసీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. కాలేజీ ఫంక్షన్‌లో ఆడపిల్లలు, అబ్బాయిలు స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తుండగా, కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు మరికొందరు కూడా వారితో కలిసి కరెన్సీ నోట్ల వర్షం కురిపించినట్లు వీడియో క్లిప్‌లు చూపించినట్లు డాన్‌ పేర్కొంది.
 
నవంబర్ 4న, ప్రిన్సిపాల్- ఇతరులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్న వ్యక్తులు, హాల్‌లోని ఇతరులు అసభ్య నృత్యం, అభ్యంతరకర హావభావాలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు విద్యా, నైతిక- సామాజిక విలువలను ఉల్లంఘించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌, అతని సహచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐతే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.