సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:20 IST)

విద్యార్థినికి మత్తు కలిపిన కూల్‌డ్రింక్స్ తాపించి నగ్నంగా ఫోటోషూట్

arrest
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థినికి మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి నగ్నంగా చేసి ఫోటోలు తీశారు. ఈ దారుణం జిల్లాలోని పెద్దడోర్నాల మండలంలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) అనే విద్యార్థి డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు మార్కాపురం వ్చచింది. ఆమెతో ఇదివరకే పరిచయం ఉన్న మీరావలి.. ఆ విద్యార్థినితో మాటలు కలిపి, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.
 
అది తాగిన కొద్దిసేపటికే ఆ యువతి స్పృహతప్పి పడిపోయింది. ఆ వెంటనే ఆమెను నగ్నంగా చేసి తన ఫోనులో వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. వాటిని చూసిన మీరావలి స్నేహితుడు రసూల్ (22) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ కావడంతో విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి చేరాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.