గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 జనవరి 2025 (19:30 IST)

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

crime
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని దినాజ్ పూర్ జిల్లా హిల్లి అనే గ్రామంలో భార్యను హత్య చేసాడు భర్త. ఈ హత్య కూడా ఊరికి బయట వున్న పొలాల్లో జరిగింది. ఆమెను వాడు అందుకే హత్య చేసాడు అంటూ ఆ ఊరి పెద్దలు చెప్పారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గత శుక్రవారం నాడు భార్యాభర్తలు సుచిత్ర, హేమంత్ ఇద్దరూ వంటగదిలో కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుంటున్నారు. ఇంతలో ఆమె ఫోనులో టింగ్ మంటూ శబ్దం వచ్చింది.
 
ఫోనులో వున్న సందేశం చూసిన సుచిత్ర భర్త వద్దకు వచ్చి టాయిలెట్‌కి వెళ్లొస్తానంటూ వంట గది నుంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన సుచిత్ర ఎంతకీ తిరిగి రాలేదు. దీనితో హేమంత్ టాయిలెట్ గది వద్దకు వెళ్లి చూస్తే ఆమె అక్కడ లేదు. ఇక ఊరు బయట పొలాల్లో ఆమెను వెతికేందుకు టార్చ్ లైట్ వేయకుండా చీకట్లోనే వెళ్లాడు. తన భార్య వేరే పురుషుడితో రాసలీలల్లో మునిగి తేలడాన్ని కళ్లారా చూసాడు. అంతే... అక్కడే వున్న పెద్ద చెట్టు కొమ్మను విరిచి ఆమె తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీనితో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
 
భార్యతో వున్న వ్యక్తిని కూడా చంపేందుకు వెంటపడినా అతడు దొరకలేదు. తెల్లారాక సుచిత్ర హత్య ఉదంతం తెలిసింది. కాగా హేమంత్ భార్య తన ప్రియుడితో ఇప్పటికే మూడుసార్లు పట్టుబడినా పెద్దల జోక్యంతో ఆమెను వదిలేసినట్లు చెప్పారు. అలాగే ఓసారి కేసు పోలీసుల దాకా వెళ్లినా కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం. ఇన్ని జరిగినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సుచిత్రను హత్య చేసినట్లు ఆమె భర్త హేమంత్ పోలీసులతో చెప్పాడు.