Khammam: కోటీశ్వరుడు.. ట్రేడింగ్ పేరిట ట్రాప్ చేసి మిర్చితోటలో చంపేశారు.. ఎక్కడ?
హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. సికింద్రాబాద్‌లోని విక్రమ్‌పురిలో నివసిస్తున్న ఈ విద్యావేత్త, కోటీశ్వరుడు బొల్లు రమేష్, కాచిగూడలో జరిగిన కిడ్నాప్ తర్వాత హత్యకు గురయ్యారు.
ఈ హత్య కేసులో బండ్లగూడకు చెందిన అహ్మద్ ఖాద్రీ అనే వ్యాపారవేత్త ప్రమేయం ఉందని అనుమానిస్తూ, రమేష్ భార్య కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది.
దీనిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని కుసుమంచిలో రమేష్‌ను చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించిన ఖాద్రీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని కార్కానా పోలీసులు నిర్ధారించారు. మృతుడి చేతులను తాళ్లతో బిగించి దారుణంగా కొట్టి హత్యచేసినట్లు గుర్తించారు. మృతుడు బొల్లు రమేష్ ఏపీ, తెలంగాణ పాన్ మసాలా డీలర్‌గా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ట్రేడింగ్ పేరిట బొల్లురమేష్‌ను ట్రాప్ చేసి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు.