గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (14:56 IST)

ఫోను మాట్లాడొద్దన్నాడనీ భర్త జననాంగాలపై వేడి నూనె పోసిన భార్య ... ఎక్కడ?

crime scene
పొరుగింటివారితో ఫోనులో మాట్లాడుకున్న భర్త జననాంగాలపై కట్టుకున్న భార్య సలసల కాగుతున్న వేడివేడి నూనెల పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భర్త.. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌ జిల్లా మాధవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన సునీల్ ధాకడ్, భావన అనే దంపతులు ఉన్నారు. భావన మాత్రం పొద్దస్తమానం ఫోనులో పొరుగింటివారితో మాట్లాడసాగేది. దీన్ని పలుమార్లు భర్త ఖండించాడు. ఫోనులో మాట్లాడటం తగ్గించాలని హితవు పలికాడు. కానీ, భావన ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగసాగాయి. పలుమార్లు ఫోను మాట్లాడనీయకుండా భార్యను భర్త అడ్డుకున్నాడు. 
 
దీంతో ఆగ్రహంచిన భార్య.. భర్త నిద్రపోతున్న సమయంలో వేడివేడి నూనెను అతని జననాంగాలపై పోసింది. దీంతో సునీల్ జననాంగాలు బాగా కాలిపోయాయి. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.