మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:01 IST)

సెప్టెంబరు 30, అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం... క్విజ్‌లో పాల్గొనండి...

అనువాదం అనేది అతి ముఖ్యమైనది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు సహకరించేది అనువాదమే. ఎందుకంటే ప్రపంచంలోని ఒక్కో దేశంలో ఒక్కో భాష చెలామణిలో వుంటుంది. ఆయా భాషలను తమ సొంత భాషలోకి అనువదించినపుడే వారు తెలుపుచున్నది లేదంటే వారు మాట్లాడినద

అనువాదం అనేది అతి ముఖ్యమైనది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు సహకరించేది అనువాదమే. ఎందుకంటే ప్రపంచంలోని ఒక్కో దేశంలో ఒక్కో భాష చెలామణిలో వుంటుంది. ఆయా భాషలను తమ సొంత భాషలోకి అనువదించినపుడే వారు తెలుపుచున్నది లేదంటే వారు మాట్లాడినది ఏమిటో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్నప్పుడే వివిధ దేశాల నాగరికతలు మనకు తేటతెల్లమవుతాయి. అందుకే అనువాదం అనేది ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. 
 
ఈ నేపధ్యంలో అనువాద క్రియ ఎంతటి ముఖ్యమైనదో 1953లోనే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ గుర్తించారు. ఇక అంతర్జాలం ప్రపంచాన్ని ఓ కుగ్రామంలో మార్చివేసిన ఈ తరుణంలో ఒకరి భాష ఒకరు అర్థం చేసుకోవాల్సిన, మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలోనే మే 24, 2017న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయిస్తూ దీనికి ఆమోదాన్ని తెలిపింది.
 
ఇక అనువాదం ప్రక్రియను చూస్తే ఇదివరకు సంస్కృతం, ఆంగ్లం నుంచి మన తెలుగు భాషలోకి ఎన్నో నవలలు, గ్రంథాలు అనువదించబడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో భాషలకు చెందిన సాహిత్యం, ఇంకా ఆయా దేశాలు అనుసరించే చట్టాలు... తదితర విషయాలన్నీ కేవలం అనువాదంపైనే ఆధారపడి వున్నాయి. ఈ నేపధ్యంలో క్విజ్‌ను మీ ముందు వుంచుతున్నాం. ఈ ఆసక్తికర క్విజ్‌లో పాల్గొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...