ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శుక్రవారం, 5 నవంబరు 2021 (17:22 IST)

కుప్పంలో తెదేపాను నామరూపాల్లేకుండా చేయాలని వైసిపి యత్నం

ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రాజకీయంగా ఉడికిపోతోంది. నువ్వా..నేనా అన్న రీతిలో రెండు పార్టీల నేతలు ఉన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఉన్న కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని వైసిపి స్కెచ్ గీసేసింది.
 
మరోవైపు చంద్రబాబుకు ఈ ఎన్నిక కాస్త ప్రతిష్టగా మారింది. కుప్పం మున్సిపాలిటీగా మారిన తరువాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో చంద్రబాబు కోటాలో పాగా వేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసిపి నేతలు. 
 
ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే రంగంలోకి దిగారు. దీంతో చంద్రబాబు కూడా రెండురోజుల పాటు కుప్పంలో పర్యటించాల్సి వచ్చింది. దీంతో పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబులా రాజకీయం మారింది. 
 
ఒక మున్సిపల్ అధికారి కుప్పంకు వచ్చి సంఘమిత్ర సభ్యులతో మీటింగ్ పెట్టారు. పెద్దిరెడ్డికి చెంచాలుగా కొంతమంది నేతలు మారారనీ, అందుకే నేరుగా కాకుండా పక్కదారి నుంచి ఎన్నికలకు సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు.
 
ఈ అధికారి మీ చెంచా అయితే మీ ఇంటికి పిలిపించుకుని పనిచేయించుకో.. అంతే తప్ప ఓటర్లను ప్రభావితం చేయడం ఏంటంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి అంటూ వ్యాఖ్యలు  చేశారు.
 
ఇది కాస్త పెద్దిరెడ్డి వర్గాన్ని తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కుప్పంలో రంగంలోకి దిగిన పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు. నీలాగా ఎక్కడో కూర్చుని మాట్లాడము. ఇక్కడే ఉంటాము. ఇక్కడే మాట్లాడతాము. కుప్పంలో కాదు పుంగనూరులో నువ్వు పర్యటించగలవా అంటూ ప్రశ్నించారు ద్వారకానాథరెడ్డి.