Festival Posters
✕

నారా లోకేష్ పోటీచేసే లొకేషన్‌పై క్లారిటీ.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ

Written By కుమార్
Updated: బుధవారం, 13 మార్చి 2019 (15:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయంపై ఇన్నాళ్లూ ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. తొలుత విశాఖ జిల్లా భీమిలి లేదా విశాఖ ఉత్తరం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్లుగానే ఆ స్థానాల్లోని ఆశావహులు మిన్నకుండిపోయినట్లు సమాచారం.
 
అయితే విస్తృత చర్చల అనంతరం నారా లోకేష్‌ను రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి వేగంగా జరగాలన్నా, ఆ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంట ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలంటే లోకేష్‌ను అక్కడి నుండి పోటీలోకి దింపాలని పార్టీ నిర్ణయించిందని సమాచారం. 
 
ప్రస్తుతం నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఉండగా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. పోటీ స్థానాన్ని నిర్ధారించిన వెంటనే లోకేషన్ మంగళగిరిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఉన్నారు.

అన్నీ చూడండి

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

Pawan Kalyan and Sreeja :అందుకే పవన్ కళ్యాణ్ విడిపోయారు - బాబాయ్ బాటలో అమ్మాయి కూడా ? : వేణుస్వామి

Pawan Kalyan and Anna divorced: పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్, అన్నా కొనిదెల విడిపోతున్నట్లు ప్రకటన

తర్వాతి కథనం
Show comments