బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: గురువారం, 17 మే 2018 (23:00 IST)

మా వెనుక పవన్ కళ్యాణ్ వున్నారు... అంతే చాలంటున్నారు...

పేద ప్రజలకు అండగా నిలుస్తానన్నాడు. అన్నగా వచ్చిన పవన్ కళ్యాణ్‌ ఆ గ్రామంలో కొండంత ధైర్యాన్ని నింపాడు. బాధితుల తరపున ప్రభుత్వాన్ని నిలదీశాడు. తీరు మార్చకోకపోతే వారి తరపున ఉద్యమానికి సిద్థమన్నాడు. గతంలో అనేక సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించిన పవన్ కళ్యా

పేద ప్రజలకు అండగా నిలుస్తానన్నాడు. అన్నగా వచ్చిన పవన్ కళ్యాణ్‌ ఆ గ్రామంలో కొండంత ధైర్యాన్ని నింపాడు. బాధితుల తరపున ప్రభుత్వాన్ని నిలదీశాడు. తీరు మార్చకోకపోతే వారి తరపున ఉద్యమానికి సిద్థమన్నాడు. గతంలో అనేక సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించిన పవన్ కళ్యాణ్‌‌కు ఇప్పుడు ఆ అవకాశం ఉందా... ప్రభుత్వం దీన్ని సానుకూలంగా చూస్తుందా.. 
 
పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజాసమస్యలపై తనదైన శైలిలో పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్‌. ఉద్దానం బాధితులకు అండగా నిలవడడంతో పాటు రాజధాని రైతుల బాధలు విన్నాడు. అయితే గత కొంతకాలం వరకు ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న పవన్ కళ్యాణ్‌ ఆయన ఏ సమస్యను లేవనెత్తినా దాని పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించేది. ఒక ముఖ్యుడు సలహా ఇచ్చినట్లుగా చంద్రబాబు దాన్ని చొరవతీసుకుని పరిష్కరించేవారు. 
 
అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టిడిపితో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు పవన్ కళ్యాణ్‌. ప్రభుత్వం చేస్తున్న లోపాలను నిగ్గతీసి అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ ఎత్తిచూపిన మరో ప్రజాసమస్య తిరుపతి శివారులోని శెట్టిపల్లి రైతుల ఆవేదన. ఎన్నో యేళ్ళుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ఎలాంటి పరిహారం లేకుండా ఉన్నఫలంగా ప్రభుత్వం రాసేసుకోవడాన్ని పవన్ కళ్యాణ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులకు న్యాయం చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 
 
శెట్టిపల్లి రైతుల సమస్య పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారుతోంది. ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి సమస్యను పరిష్కరించడం ఒక ఎత్తు. పోరాడి సాధించుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ రెండో మార్గాన్ని ఎంచుకున్నారా. చంద్రబాబు దీన్ని సానుకూలంగా చూడకపోతే యుద్ధానికి సిద్థమైనట్లేనా. బాధితుల తరపున ఎలాంటి పోరాటం చేసి వారికి న్యాయం చేస్తారన్నది అందరిలోను నెలకొన్న ఆసక్తి. చట్టాలను అనుసరించి పోతే ప్రభుత్వ వాదనే సరైనదిగా కనిపిస్తోంది. కానీ అక్కడున్న పేద రైతుల కోణంలో అనుసరిస్తే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ముమ్మాటికే అన్యాయమే. 
 
ఇంతకాలం చంద్రబాబుతో స్నేహబంధాన్ని కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు దీన్ని ఏ విధంగా పరిష్కరించగలరు. నిజంగా శెట్టిపల్లి రైతులకు న్యాయం చేయగలిగితే పవన్ కళ్యాణ్‌‌కు ప్రజల్లో ఆదరణ పెరిగినట్లేనని భావించాలి. పవన్ కళ్యాణ్‌ ఈ సమస్యను పరిష్కరిస్తారో లేదో కానీ ఆయన పర్యటనతో ఆ గ్రామాల్లో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తమకు ఒక బలమైన నాయకుడు అండగా ఉన్నాడన్న ఆనందం కనిపించింది. తమ తరపున ఎలాంటి లాలూచీ లేకుండా పవన్ కళ్యాణ్‌ నిజంగా పోరాడగలిగితే అన్నివేళలా ఆయనకు అండగా ఉంటామంటున్నారు గ్రామస్తులు. ఇప్పటికిప్పుడు పరిష్కారం కాకపోయినా పవన్ కళ్యాణ్‌ లాంటి నాయకుడు ఈ సమస్యను ప్రస్తావించడం ద్వారా తమ సమస్య ఏంటో ప్రపంచానికి తెలిసిందంటున్నారు అక్కడి గ్రామస్తులు.