ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 10 డిశెంబరు 2021 (13:12 IST)

హైదరాబాద్‌ మహిళల కోసం సిద్ధమైన ఎస్‌ మేడమ్‌

ఇంటి వద్దనే స్త్రీ, పురుషులిరువురికీ సెలూన్‌ సేవలను అందించే వినూత్నమైన బ్రాండ్‌ ఎస్‌ మేడమ్‌. వినియోగదారులు కోరుకున్న రీతిలో వారికి సౌకర్యవంతమైన సమయంలో బ్యూటీ, వెల్‌నెస్‌ సేవలను వారి ఇంటి ముంగిటనే ఈ సంస్ధ అందిస్తుంది.
 
 
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతో పాటుగా వాణిజ్య నగరం ముంబైలో అపూర్వమైన ఆదరణ పొందిన తరువాత ఈ బ్రాండ్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌, ముంబైలలో నెలకు 30 వేలకు పైగా ఆర్డర్లను ఎస్‌ మేడమ్‌ అందుకుంటుంది. ఎస్‌ మేడమ్‌ తమ సేవలను హైదరాబాద్‌లో అత్యంత అందుబాటు ధరలో అందిస్తుంది.
 
ఏ నగరంలో అయినా ఒకే ధరకు ఇది తమ సేవలను అందిస్తుంది. బ్యూటీ సేవలను నిమిషానికి ఆరు రూపాయల చొప్పున అందిస్తారు. థ్రెడింగ్‌ నుంచి వ్యాక్సింగ్‌ వరకూ, పెడిక్యూర్‌ మొదలు బాడీ బ్రైటెనింగ్‌ వరకూ, బాడీ స్పా నుంచి హెయిర్‌ కట్‌ వరకూ అన్ని సేవలూ వీటిలో ఉన్నాయి. ఈ సేవలనందించే బ్యూటీషియన్లు అందరూ పూర్తిగా టీకాలను తీసుకున్న వారు మాత్రమే కాదు, పూర్తిగా కోవిడ్‌ మార్గదర్శకాలను సైతం వారు అనుసరిస్తారు.
 

‘‘బ్యూటీ సేవల కోసం ప్రజలు సుదూరాలకు వెళ్తుంటారు. ఆ సేవలను తామే వారి ఇంటి ముంగిట అందిస్తే అనే ఆలోచనల నుంచి ఎస్‌ మేడమ్‌ పుట్టింది. ఈ ఆలోచనకు న్యూఢిల్లీ, ముంబై లలో అపూర్వమైన ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతోనే దక్షిణ భారతదేశంలో మా సేవలను విస్తరించాము. దానిలో భాగంగా తొలుత హైదరాబాద్‌లో మా సేవలను ప్రారంభించాము’’ అని మయాంక్‌ ఆర్య, కో-ఫౌండర్-ఎస్‌ మేడమ్‌ అన్నారు.