శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By pnr
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (09:10 IST)

నవంబర్ 16 : నేషనల్ ఫాస్ట్ ఫుడ్ డే

ప్రతి యేడాది నవంబరు 16వ తేదీని నేషనల్ ఫాస్ట్‌ఫుడ్ డేగా పాటిస్తున్నారు. ప్రతి యేడాది జరిగే ఈ ఫాస్ట్‌ఫుడ్ వేడుకల్లో దేశ ప్రజలు తమకు తోచిన విధంగా ఇన్‌సైడ్ డైనింగ్ లేదా, ఫాస్ట్‌ఫుడ్ ఆర్డర్ రూపంలో జరుపుకుం

ప్రతి యేడాది నవంబరు 16వ తేదీని నేషనల్ ఫాస్ట్‌ఫుడ్ డేగా పాటిస్తున్నారు. ప్రతి యేడాది జరిగే ఈ ఫాస్ట్‌ఫుడ్ వేడుకల్లో దేశ ప్రజలు తమకు తోచిన విధంగా ఇన్‌సైడ్ డైనింగ్ లేదా, ఫాస్ట్‌ఫుడ్ ఆర్డర్ రూపంలో జరుపుకుంటున్నారు. 
 
అతి తక్కువ సమయంలో, త్వరితగతిన కస్టమర్‌ నోటికి రుచికరంగా ఉండే ఆహారాన్ని తయారు ఇచ్చే ఆహారశాలలనే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు అంటారు. ఈ తరహా సెంటర్లు 1950లో అమెరికాలో బాగా పాపులర్ అయ్యాయి. వీటికి ఫాస్ట్‌ఫుడ్ అనే పేరు 1951లో మెర్రియమ్-వెబ్‌స్టర్‌ డిక్షనరీలో గుర్తించారు. 
 
మొదటి ప్రపంచ యుద్ధం తదనంతరం డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లను ప్రపంచానికి పరిచయం చేశారు. 1921లో అమెరికాకు వాల్టర్ ఆండర్సన్ అనే వ్యక్తి సారథ్యంలోని వైట్ క్యాస్టల్ అనే కంపెనీ వివిధ రకాల ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్స్‌ను కనుగొని వాటిని ఐదు సెంట్స్‌కు విక్రయించింది. 
 
ఆ తర్వాత వాల్టర్ ఆండర్సన్ 1916లో వైట్ క్యాస్టల్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఇందులో అతి తక్కువ ఐటమ్స్‌, మంచి నాణ్యత, రుచితో కూడి తక్కువ ధరకు, త్వరితగతిన సరఫరా సర్వ్ చేశాడు. ఆ తర్వాత వీటికి అమెరికాలో మంచి ప్రాచూర్యం పొందాయి.