మిరియాలతో రొయ్యల కూర ఎలా చేయాలి?
శుభ్రం చేసుకున్న రొయ్యలకు ఉప్పు, పసుపు పట్టించి పెట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి మద్దను మిక్సీలో వేసుకుని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట
చినుకుల్లో ఏర్పడే జలుబు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే మిరియాల పొడిని వంటల్లో చేర్చుకోవాలి. ఇంకా క్యాల్షియాన్ని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచే రొయ్యలను కూడా వారానికి ఓసారి తీసుకోవాలి. ఈ రెండింటి కాంబోలో మిరియాలతో రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
రొయ్యలు - అరకేజీ
ఉల్లిపాయలు, టొమాటో తరుగు - చెరో అరకప్పు
వెల్లుల్లి, అల్లం ముద్ద - పావు కప్పు
దాల్చినచెక్క - రెండు ముక్కలు,
లవంగాలు - మూడు,
కొబ్బరితురుము - పావుకప్పు,
ఎండు మిర్చి - ఐదు
ధనియాల పొడి - రెండు చెంచాలు
పసుపు - చెంచా
జీలకర్ర పొడి - ఒక స్పూన్
మిరియాలు - చెంచా,
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత
తయారీ విధానం :
శుభ్రం చేసుకున్న రొయ్యలకు ఉప్పు, పసుపు పట్టించి పెట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి మద్దను మిక్సీలో వేసుకుని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి. అందులో ఆవాలూ, దాల్చినచెక్కా, లవంగాలు, బిర్యానీ ఆకులు వేయించుకోవాలి. నిమిషం తరవాత కరివేపాకు రెబ్బలు వేయాలి. దోరగా వేగాక రుబ్బుకున్న మసాలా వేయాలి. ఉప్పు, కారం తగినంత చేర్చాలి. బాగా వేగాక...రొయ్యల్ని కూడా వేయాలి. 20 నిమిషాలయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, రొట్టెల్లోకీ బాగుంటుంది.