హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గంలో జరిగిన భూముల వేలం గణనీయమైన విజయాన్ని ప్రకటించింది. ఇందులో ఎకరానికి రూ.177 కోట్లు పలకడం ద్వారా దేశంలోనే కాకుండా ఆసియా స్థాయిలోనూ ఇది ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఘనవిజయం హైదరాబాద్‌ను భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టడమే కాకుండా, దీని దీర్ఘకాలిక వృద్ధిపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది.
ఈ వేలం విజయం రాయదుర్గం ప్రాధాన్యతను స్పష్టంగా చాటుతోంది. ఇది హైటెక్ సిటీకి అనుసంధానంగా ఉన్న పశ్చిమ ఐటీ కారిడార్‌కు గేట్వేగా పనిచేస్తోంది. మెగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కార్పొరేట్ కార్యాలయాల కేంద్రమైన ఈ ప్రాంతంలో భూముల విలువ పెరుగడాన్ని ప్రధాన డెవలపర్లు బహుళ సంవత్సరాల హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టులకు భూములను ముందుగా సురక్షితంగా భద్రపరుచుకునేందుకు అవకాశంగా చూస్తున్నారు.
పౌలోమి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ రావు మాట్లాడుతూ, ఈ ట్రెండ్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎంత వాగ్దానంగా, ఇక్కడ వ్యాపారం చేయడంపై పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో చూపుతోంది అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ రంగాల విస్తరణతో పాటు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్(GCCs) నుండి భారీ స్థాయిలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఉండటం, దీనివల్ల రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లకు కూడా డిమాండ్ పెరగనుంది.
ఈ రికార్డు ధరలు పెట్టుబడిదారులు, డెవలపర్లు హైదరాబాద్‌పై కలిగి ఉన్న విశ్వాసానికి ప్రతిరూపం. అలాగే, తెలంగాణ రైజింగ్- 2047 దిశగా ప్రభుత్వం చూపుతున్న దూరదృష్టికి ప్రతిఫలంగా పరిగణించబడుతోంది. ఈ విజయాన్ని పారదర్శకత, పెట్టుబడికి అనుకూలమైన వాతావరణం, వేగవంతమైన అభివృద్ధి సాధించే వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం తీసుకున్న కట్టుబాటుకే ఫలితంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ అభివృద్ధికి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి, గౌరవనీయ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు గార్లు నేతృత్వం వహిస్తున్నారు.
భూమి ధరల్లో వేగవంతమైన పెరుగుదల: హైదరాబాద్‌లో భూముల ధరలు ఎలా మారాయో చూస్తే ఇది స్పష్టమవుతుంది
2017 (రాయదుర్గం): రూ.42.59 కోట్లు ఎకరా
2022 (నియోపాలిస్, కోకాపేట్): రూ.100.75 కోట్లు ఎకరా
2025 (రాయదుర్గం): రూ.177 కోట్లు ఎకరా 2017తో పోల్చితే ఇది నాలుగు రెట్లు పెరుగుదల.
వికాస దృక్పథంతో ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక డెవలపర్లు:
ప్రెస్టిజ్, ఎంఎస్ఎన్ వంటి పేరొందిన డెవలపర్లు రూ.140 నుండి రూ.170 కోట్ల మధ్యలో భూములు కొనుగోలు చేశారు. ఇది కేవలం ఊహాత్మక పెట్టుబడి కాకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. ధరలు పెరిగినప్పుడు డెవలపర్లు ఆచితూచి ప్రాజెక్టుల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, హైదరాబాద్ మార్కెట్ ఇందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. మధ్య తరగతి, అప్పర్ మిడ్ సెగ్మెంట్లకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టులకు వినియోగదారుల మద్దతు ఉంది.
ఈ రాయదుర్గం వేలం విజయవంతం కావడం ద్వారా, హైదరాబాద్ దేశంలో అత్యంత స్థిరమైన, వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతున్న ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటిగా మరింతగా గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ముడి ధనాల లభ్యత, పెట్టుబడిదారుల నమ్మకం రెండింటినీ స్పష్టంగా చూపిస్తుంది.