1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (14:14 IST)

ఆరేళ్లలో గ్లోబల్ ఆయుర్దాయం రేటు 6.2గా పెరిగిందట!

ఆరేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్దాయం రేటు పెరిగిందని లాసెంట్‌లో ప్రచురితమైన కథనం ద్వారా తెలియవచ్చింది. 1990 నుంచి 2013 వరకు జరిగిన అధ్యయనంలో ప్రపంచ ఆయుర్దాయం రేటు 6.2గా పెరిగిందని పరిశోధకులు తెలిపారు. ఇందులో పురుషుల ఆయుర్దాయం ప్రపంచ వ్యాప్తంగా 5.8గా పెరగగా, మహిళల ఆయుర్దాం అదనంగా 6.6గా పెరిగింది. ఇందుకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు, హృద్రోగ సమస్యలు తగ్గడమే కారణమని పరిశోధకులు అంటున్నారు. 
 
188 దేశాల్లో మరణాలకు గల ప్రధాన కారణాలపై జరిపిన అధ్యయనంలో క్యాన్సర్‌తో 15 శాతం మంది మరణించగా, హృద్రోగ వ్యాధులతో 22 శాతం మంది మరణించినట్లు యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్‌కు చెందిన 700 పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది.
 
పేద దేశాల్లో డయేరియా వంటి ఇన్ఫెక్షన్లు వంటి రోగాలు తగ్గుముఖం పట్టడంతో పాటు హృద్రోగ వ్యాదులు తగ్గిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్దాయం రేటు పెరిగిందని పరిశోధకులు తెలిపారు. అయితే 125 శాతం అత్యధికులు లివర్ క్యాన్సర్, పాన్‌క్రియేటిక్-క్యాన్సర్‌‌తో 7 శాతం మంది, డయాబెటిస్‌తో 9 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని వారు చెప్పారు. అయితే కిడ్నీ,కాలేయ సంబంధిత వ్యాధులతో ప్రజలు అప్రమత్తత అవసరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.