1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (12:18 IST)

బీట్‌రూట్‌ను ఉడికించి తీసుకుంటే..?

శరీరానికి అవసరమయ్యే శక్తిని అందించే కూరగాయల్లో బీట్‌రూట్ ఒకటి. అయితే దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. బీట్‌రూట్‌లోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పకుండా దానికి తీసుకోవాలసిపిస్తుంది. చాలామంది రోజంతా యాక్టివ్‍‌గా, ఎనర్జీగా ఉండాలని కోరుకుంటారు.. కానీ, కొన్ని కారణాల వలన అలా ఉండలేకపోతున్నారు. అందుకు బీట్‌రూట్ మంచి ఔషధంగా పనిచేస్తుంది.. మరి దీనిలోని లాభాలేంటంటే...
 
1. బీట్‌రూట్ రక్తప్రసరణకు చాలా మంచిది. శరీరానికి రక్తాన్ని పెంచుటకు సహాయపడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే శరీరానికి అవసరమైయ్యే ఆక్సిజన్ బీట్‌రూట్‌లో అధిక మోతాదులో ఉంది. కనుక రోజుకో బీట్‌రూట్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఫలితాలు లభిస్తాయి. 
 
2. బీట్‌రూట్‌లోని విటమిన్ సి, బి, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు అధికం. ఈ లవణాలు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. హైబీపీని అదుపులో ఉంచుతాయి. బీట్‌రూట్ తీసుకుంటే ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపవుతుంది. 
 
3. ప్రతిరోజూ పిల్లలకు బీట్‌రూట్ చేసిన జ్యూస్ తాగిస్తే వారిలో హిమోగ్లోబిన్ శాతం అధికమవుతుంది. రక్తం మెరుగుపడుతుంది. మెదడ పనితీరుకు చాలా మంచిది. జ్ఞాపకశక్తిని పెంచుటకు బీట్‌రూట్ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. 
 
4. రక్తహీనతతో బాధపడేవారు.. రోజుకో కప్పు బీట్‌రూట్ ముక్కలు తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఐరన్ శాతాన్ని పెంచుతుంది. 
 
5. బీట్‌రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. శుభ్రం చేయాలి. ఆపై వాటిలో కొద్దిగా ఉప్పు, నీరు కలిపి ఉడికించుకోవాలి. తరువాత 3 ఎండుమిర్చి, చిన్న కొబ్బరి ముక్క, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి పొడిచేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఉడికించిన బీట్‌రూట్‌లో వేసి కాసేపు వేయించి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది. 
 
6. మహిళలు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు రోజూ గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఈ సమస్యకు కారణం వారిలోని ఐరన్ లోపమే. ఈ లోపాన్ని బీట్‌రూట్ తగ్గిస్తుంది. కాబట్టి తరచుగా ఆహారంలో దీనిని చేర్చుకుంటే మంచిది.