సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 26 నవంబరు 2020 (21:01 IST)

ప్రపంచ వ్యతిరేక ఊబకాయం రోజు, ప్రతిరోజూ ఇలా చేస్తే ఊబకాయానికి చెక్

నవంబరు 26న ప్రతి ఏటా ప్రపంచ వ్యతిరేక ఊబకాయం రోజును జరుపుకుంటారు. ప్రపంచంలో రోజురోజుకీ అధిక బరువు, ఊబకాయం సమస్యలో చిక్కుకునేవారు అధికమవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ దిగువ తెలిపిన చిట్కాలను పాటిస్తే అధిక బరువుకి అడ్డుకట్ట వేయవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అవేమిటో చూద్దాం.
 
1. ప్రతిరోజూ నిమ్మరసంలో కాస్త తేనె కలుపుకుని తాగాలి.
 
2. ఉదయాన్నే తీసుకునే అల్పాహారాన్ని మిస్ చేయవద్దు. అలా చేస్తే ఆకలితో ఆ తర్వాత మరింత ఎక్కువ ఆహారాన్ని భుజిస్తారు. ఫలితంగా అధిక బరువు సమస్య వస్తుంది.
 
3. స్నాక్స్ తీసుకునేవారు వాటిలో పండ్లు, కూరగాయలు వుండేట్లు చూసుకోవాలి. జంక్ ఫుడ్ జోలికి వెళ్లవద్దు.
 
4. బాదం పప్పు వంటి గింజలను తీసుకుంటుండాలి.
 
5. ఎక్కువగా తీపి పదార్థాలను తీసుకోవద్దు. చక్కెరకు బదులు తేనె కానీ లేదంటే బెల్లం కానీ ఉపయోగించండి.
 
6. ప్రతిరోజూ వ్యాయామం చేయడం మానుకోవద్దు. యోగా, నడక, ఈత, సైక్లింగ్ ఏదైనాసరే తప్పక చేయాల్సిందే.