శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (11:16 IST)

కరోనా వైరస్‌ను అడుకునే మూడు రకాల ఫుడ్స్ ఇవే...

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ వైరస్ వెలుగు చూసిన తర్వాత శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు వివిధ రకాలైన బలవర్థక ఆహారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా, సిట్రజ్ జాతి పండ్లను అధికంగా ఆరగిస్తున్నారు. 
 
అయితే, ఈ వైరస్ బారినపడకుండా ప్రజలు తీసుకుంటున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలలో ఏ ఫుడ్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది? అదే విషయాన్ని సైంటిస్టులు గుర్తించారు. జర్మనీకి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాలిక్యులార్‌‌ వైరాలజీ, యూఐఎమ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌‌ సైంటిస్టుల స్టడీ ప్రకారం గ్రీన్‌ టీ, దానిమ్మ, క్రాన్‌బెర్రీ, చోక్‌బెర్రీ.. కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటాయని వెల్లడించారు. దీనికిగల కారణాలను కూడా వారు వివరించారు. 
 
* రకరకాల గ్రీన్‌ టీలు అందుబాటులో ఉన్నా వాటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు వైరస్‌పై పోరాడుతున్నాయి. ఫ్లూను అరికట్టే లక్షణాలు కూడా గ్రీన్‌ టీలో ఉంటాయి.
 
* అలాగే, దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ డైరెక్ట్​గా కరోనా వైరస్‌పై పోరాడకున్నా ఓవరాల్‌ హెల్త్‌ విషయంలో బాగా పనిచేస్తాయి. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్-సి ఇమ్యూనిటీని పెంచుతుంది.
 
* చోక్‌బెర్రీస్‌ కూడా కోవిడ్‌ను అరికట్టడంలో మిగతా వాటికంటే బెటర్‌‌గా పనిచేస్తాయి అంటున్నారు సైంటిస్ట్​లు.