శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (11:49 IST)

దేశంలో కరోనా మహమ్మారి, మరో 44,281 మందికి పాజిటివ్ నిర్ధారణ

దేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు వస్తున్నాయి. దేశంలోని కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 44,281మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కి చేరింది. గత 24 గంటల్లో 50,326మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల సమయంలో 512 మంది కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు.
 
దీంతో మృతుల సంఖ్య 1,27,571కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 80,13,784 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 4,94,657మంది ప్రస్తుతం ఆసుపత్రి, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు.