శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (21:58 IST)

అరటి పండు తింటే హాయిగా నిద్రలోకి...

రాత్రి భోజనం తరువాత చిరుతిల్లు తీసుకోవడం మంచిది కాదనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే కొన్ని స్నాక్స్ తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. కండరాలు రిలాక్స్ కావడానికి అవి

రాత్రి భోజనం తరువాత చిరుతిల్లు తీసుకోవడం మంచిది కాదనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే  కొన్ని స్నాక్స్ తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. కండరాలు రిలాక్స్ కావడానికి అవి బాగా ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గకుండా అరటిపళ్లలోని కార్బొహైడ్రేడ్స్ పనిచేస్తాయి. 
 
కాబట్టి అరటి పండు తిని పడుకుంటే గంటలోపే నిద్రలోకి జారుకోవచ్చు. అంతేకాదు పాలల్లో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలోని సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేసి శరీరాన్ని నిద్రపుచ్చడంలో ఉపక్రమిస్తుంది. ఇక పడుకునేముదు నట్స్ తీసుకుంటే నిద్రహాయిగా పడుతుందని డైటీషియన్స్ చెపుతున్నారు. చాక్లెట్స్, ఐస్‌క్రీములతోపాటు ఉప్పు ఎక్కువుగా ఉన్న ఫుడ్ తీసుకుంటే నిద్రాభంగం తప్పదు అంటున్నారు.