మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (17:57 IST)

పిల్లలకు స్కిన్‌లెస్ చికెనే పెట్టండి..

పిల్లలకు అందించే పోషకాహారంలో భాగంగా స్కిన్‌లెస్‌ చికెన్‌ను మాత్రమే ఆహారంలో అందిస్తే ఆరోగ్యానికి మంచిది. పెరిగే పిల్లకు ప్రోటీన్లు, విటమిన్లు చాలా అవసరం. కాబట్టి ఇందుకోసం కొందరు మాంసాహారం కూడా పెడుతుంటారు. అలాంటివారు స్కిన్‌లెస్ చికెన్‌ను మాత్రమే పిల్

పిల్లలకు అందించే పోషకాహారంలో భాగంగా స్కిన్‌లెస్‌ చికెన్‌ను మాత్రమే ఆహారంలో అందిస్తే ఆరోగ్యానికి మంచిది. పెరిగే పిల్లకు ప్రోటీన్లు, విటమిన్లు చాలా అవసరం. కాబట్టి ఇందుకోసం కొందరు మాంసాహారం కూడా పెడుతుంటారు. అలాంటివారు స్కిన్‌లెస్ చికెన్‌ను మాత్రమే పిల్లల వంటల్లో చేర్చాలని.. స్కిన్ తీయని చికెన్ ద్వారా కంటికి తెలియని బ్యాక్టీరియాతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుచేత పిల్లలకు అందించే చికెన్ స్కిన్‌లెస్‌ అయితేనే మంచిది. 
 
చికెన్‌ను పిల్లలు తీసుకుంటే కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలుండవు. ముఖ్యంగా వర్షాకాలంలో చికెన్ సూప్, చికెన్ వంటకాలను పిల్లలకు అందించడం ద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలను తొలగించవచ్చు.  
 
ఆహార పదార్థాల పట్ల పిల్లలకు అవగాహన ఇంటి నుంచే మొదలవ్వాలి. దుకాణాల్లో కొనుగోలు చేసే చిప్స్‌, సోడా, జ్యూస్‌ వంటివి నియంత్రించి ఇంట్లోనే స్వయంగా వంటకాలు, పండ్లరసాలు తయారుచేసి ఇస్తుండాలి. 
 
పోషక విలువలూ, మాంసకృత్తులు అధికంగా ఉండే పప్పుధాన్యాలను రోజువారీ ఆహారంలో వాడితే వారి ఎదుగుదల బాగుంటుంది. పిజ్జా, బర్గర్‌ వంటివాటికి దూరంగా ఉంచగలిగితే మేలు. భోంచేసే ముందు చిరుతిళ్లు జోలికి వెళ్లకుండా పిల్లలను నిరోధించాలి. అలాగే భోజన సమయంలో టీవీ ముందు కూర్చోకుండా చూడాలని చైల్డ్‌కేర్ నిపుణులు సూచిస్తున్నారు.