కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమాన్ని పరగడుపున తీసుకుంటే?
కొబ్బరి నీళ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. కొబ్బరి నీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి శరీరాన్ని ఉల్లాసంగా వుంచుతాయి. అలాగే తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లున్నాయి. ఇది సహజ సిద్ధమైన యాం
కొబ్బరి నీళ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. కొబ్బరి నీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి శరీరాన్ని ఉల్లాసంగా వుంచుతాయి. అలాగే తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లున్నాయి. ఇది సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ కారకంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఉదయాన్నే ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకుని పరగడుపునే తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ.. వృద్ధాప్య ఛాయలు లేకుండా చేస్తాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమాన్ని నిత్యం తాగుతుంటే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు పోతాయి. అల్సర్లు ఉంటే నయమవుతాయి.
కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. దీంతో అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. మిశ్రమంలో ఔషధ గుణాలు మెండుగా ఉండడం వల్ల అది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా కిడ్నీలోని వ్యర్థాలు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.