శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (11:09 IST)

తలనొప్పి... ఎలాంటిదో తెలుసుకుని ఈ చిట్కాలు పాటిస్తే...

సాధారణంగా తలనొప్పి అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వస్తుంటుంది. ఇలా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రతీ సారీ మందులు తీసుకోవడం మంచిది కాదు. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో అందరికి తెలిసిన విషయమే. కనుక తలనొప్పిని తగ్గించేంద

సాధారణంగా తలనొప్పి అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వస్తుంటుంది. ఇలా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రతీ సారీ మందులు తీసుకోవడం మంచిది కాదు. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో అందరికి తెలిసిన విషయమే. కనుక తలనొప్పిని తగ్గించేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఒకోసారి తలనొప్పి కడుపులో గ్యాస్ చేరడం వలన కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా భోజనంలో నెయ్యిని చేర్చుకుంటే తలనొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. గ్లాస్ నీటిలో ధనియాలు, చక్కెర కలుకుని తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.  
 
గంధపు చెక్కపై నీళ్ల చుక్క వేసి రాయి మీద రుద్దుకుని ఆ మిశ్రమాన్ని నుదిటికి రాసుకుంటే తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది. వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే కూడా తలనొప్పికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కుర్చీలలో కూర్చొని పాపదాలు మెుద్దుబారిపోతాయి.

అందుకు నిద్రకు ముందు బకెట్‌లో వేడినీళ్లను నింపుకుని పావుగంట పాటు ఆ నీళ్లలో పాదాలు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వలన వచ్చిన తలనొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి.