శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (14:51 IST)

గర్భిణీ మహిళలు చేపలు తినకుంటే.. శిశువుకు హాని తప్పదట..?

చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. అందుకే చేపలు వారానికి రెండుసార్లైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్

చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. అందుకే చేపలు వారానికి రెండుసార్లైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


చేపల్లో విటమిన్ డి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి తరచూ చేపలను తింటే వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ నుంచి తప్పించుకోవచ్చు. చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మానసిక ఆరోగ్యానికి కూడా పనిచేస్తాయి. మానసిక ఆందోళనలను దూరం చేస్తాయి. 
 
చేపలను తరచూ తినేవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాంటి చేపలను ముఖ్యంగా గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణులకు చేపలు ఎంత మేలు చేస్తాయో తాజా పరిశోధనలో తేలింది. గర్భం దాల్చిన తొలినాళ్లలో చేపలు తినకుంటే ముందస్తు ప్రసవం అయ్యే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. బోస్టన్‌లోని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కోపెన్‌హగెన్‌లోని స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్ట్యూట్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తెలియవచ్చింది. 
 
గర్భం దాల్చిన తొలినాళ్లలో చేపలను ఆహారంగా తీసుకోని వారిలో శిశువుకు హాని జరిగే అవకాశం ఉందని, చేపలు తీసుకునే వారితో పోల్చినప్పుడు వీరిలో నెలలు నిండకుండానే ప్రసవించే ముప్పు పది రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇంకా నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ 1.6 శాతం తక్కువగా ఉన్నాయన్నారు. కాబట్టి గర్భం దాల్చిన తొలి వారం నుంచి చేపలను సరిపడా మోతాదులో తీసుకోవాలని సూచించారు.